APESET: ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల! 1 y ago
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APECET) - 2025 నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్ధులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను మే 6న నిర్వహిస్తారు.